అందంతో ఆకట్టుకుంటున్న ఈషా రెబ్బ కిల్లింగ్ లుక్స్

బుధవారం, 8 నవంబరు 2023 (18:55 IST)
Esha Rebba
జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటించిన `దయా` వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది ఈషా రెబ్బ. తెలుగు బాగా మాట్లాడే ఈమెకు తెలుగులోనే మంచి పేరు తెచ్చుకోవాలనుందని తెలిపింది. సినిమాలోకంటే వెబ్ సిరీస్ లో మంచి పేరు వస్తుందని ఇటీవలే తెలిపింది. ఈ సందర్భంా గ్లామర్ పాత్రలు, కథ మేరకు ఎక్స్పోజింగ్ చేయడానికి సిద్ధమేనని చెప్పింది. తాజాగా ఈషా రెబ్బ కిల్లింగ్ లుక్స్ తో ఇలా అదరాలతో దర్సనమిస్తూ యూత్ ను ఆకర్షించింది.
 
తరచూ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసి అందరిలాగే అవకాశాల కోసం ఎదురుచూసే ఈషా రెబ్బ  లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చింది. 'అంతకు ముందు ఆ తర్వాత' అనే సినిమా చేసి హీరోయిన్ గా నటించింది. ఇంకా పలు సినిమాలు చేసినా పెద్దగా కంటెన్యూగా అవకాశాలు రావడంలేదని వెల్లడించింది కూడా. కాగా, తాజాగా వెబ్ సిరీస్ కోసం ఈ ఫొటో షూట్ చేసినట్లు తెలిసింది. దీనితోపాటు నల్లని చీర కట్టుకుని చీర అందాలతో అలరించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు