అట్లీ స్క్రిప్ట్ ప్రకారం, ఈ చిత్రానికి ఐదుగురు హీరోయిన్లు అవసరం. వారిలో ఎక్కువ మంది విదేశీ నటీమణులు ఉంటారు. అట్లీ మూడు ప్రధాన పాత్రల కోసం అమెరికన్, కొరియన్, ఇతర భాషా నటీమణులను తీసుకోవాలని ఆలోచిస్తున్నాడు. జాన్వీ కపూర్‌ను ఇందులో ప్రధాన మహిళా కథానాయికగా తీసుకోనున్నారు. ఇందులో మరో భారతీయ నటికి ఛాన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం అట్లీ భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని టాక్ వినిపిస్తుంది.