నటిగా వెలుగొందిన గౌతమి, వైవాహిక జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొంది. చాలా కాలంగా కమలహాసన్‌తో కలిసి ఉంటోన్న ఆమె, కొన్ని కారణాల వలన ఈ మధ్య విడిపోతున్నట్టు ప్రకటించింది. గౌతమికి సుబ్బులక్ష్మి అనే కూతురు వుంది. ఆ అమ్మాయిని హీరోయిన్‌గా పరిచయం చేస్తామంటూ కొంతమంది దర్శక నిర్మాతలు ప్రయత్నించినా, తగిన సమయం రాలేదని గౌతమి చెబుతూ వచ్చింది.
ఇక ఇప్పుడు సుబ్బులక్ష్మిని హీరోయిన్‌గా పరిచయం చేయడానికి గౌతమి సిద్ధమైనట్టు తెలుస్తోంది. శివకార్తికేయన్ కథానాయకుడిగా చేయనున్న ఒక సినిమా ద్వారా, ఆమెను పరిచయం చేయాలనే ఆలోచనలో ఉందట. అలాగే తనకి తెలిసిన దర్శక నిర్మాతలను మంచి కథలతో రమ్మని చెబుతోందని తమిళవర్గాలు పేర్కొంటున్నాయి.