ఇకపోతే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లండన్ మ్యూజియంలో రెండు గ్యాలరీలు ఉంటే 'ఒకటి గ్రీస్ గ్యాలరీ అయితే మరొకటి అమరావతి గ్యాలరీ' అని అమరావతికి సంబంధించిన చరిత్ర జ్ఞాపకాలు లండన్ మ్యూజియంలో ఇప్పటికీ భద్రపరిచి ఉన్నాయి అన్న మాటలు చంద్రబాబు నోటివెంట విన్నవారు షాక్ అయ్యారు.
చరిత్రలో ఎందరో రాజులు మన భారతదేశాన్ని పరిపాలించినా వారి చరిత్రను లండన్ మ్యూజియంలో నిక్షిప్తం చేయలేదని అటువంటి ఘనత ఒక 'శాతకర్ణి'కే సొంతం అన్న మాటలు ముఖ్యఅతిథి చంద్రబాబు నోటివెంట వచ్చాయి. ఈమాటలు విన్నవెంటనే ఆకార్యక్రమానికి వచ్చిన అతిథులతో పాటు అశేష ప్రజానీకం కూడ తెలుగు జాతి చరిత్రకు సంకేతంగా 'శాతకర్ణి' సినిమా మారబోతోంది అన్న ఊహలలోకి వెళ్ళిపోయారు.