దివంగత నందమూరి తారకరామారావు వారసులు వెండితెరపై బాలక్రిష్ణ తర్వాత పలువురు వచ్చారు. కానీ ఎవరూ అంతగా పేరు తెచ్చుకోలేకపోయారు. ఒక్క జూ. ఎన్.టి.ఆర్. మాత్రమే నిలబడ్డాడు. ఇక ఆయన్ను తమ వారసుడిగా ఒప్పుకున్నారా? లేదా? అనేది పక్కన పెడితే తాజాగా నందమూరి వంశం నుంచి ఎన్.టి.ఆర్. మునిమనవుడు, హరిక్రిష్ణ మనవడు, జానకి రామ్ తనయుడు నందమూరి తారక రామారావు ను హీరోగా పరిచయం చేయబోతున్నారు. ఆ భాధ్యతను ఆ ఫ్యామిలీకి కావాల్సిన వాడు దర్శకుడు వై.వి.ఎస్. చౌదరిపై వేశారు.