అనారోగ్యంగా ఉంటే ఎన్నికల ప్రచారం ఎలా చేశారు?

ఠాగూర్

గురువారం, 30 మే 2024 (17:18 IST)
అనారోగ్యంగా ఉంటే ఎన్నికల ప్రచారం ఎలా చేశారు అని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మి పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గురువారం రెగ్యులర్ బెయిల్  కోసం ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. అలాగే, వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్‌ను పొడగించాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ చేసిన వాదనలు ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఎన్నికల వేళ విస్తృత ప్రచారం నిర్వహించకుండా ఆయన ఆరోగ్యమేమీ అడ్డంకిగా మారలేదని గుర్తు చేసింది. 
 
మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ అరెస్టయిన సంగతి తెలిసిందే. తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం నిర్వహించుకునేందుకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ మంజూరుచేసింది. 
 
జూన్‌ 2న తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్‌ ఇటీవల సుప్రీంను ఆశ్రయించారు. జూన్‌ 9న జైలుకు వెళ్లి లొంగిపోతానని పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు