బాలీవుడ్ ప్రేమ పక్షులుగా ముద్రవేసుకుంది.. కత్రీనా కైఫ్, రణ్ బీర్ కపూర్ జంట. చెట్టాపట్టాలేసుకుని తిరగడం.. సహజీవనం కోసం ఫ్లాట్స్ వెతకడం అంటూ బిజీ బిజీగా గడిపిన కత్రీనా-రణ్ బీర్ జంటకు ఏమైందో ఏమో కానీ.. ఉన్నట్టుండి విడిపోయారు. కలిసి తిరగడం ఆపై విడిపోవడం బాలీవుడ్‌లో ఫ్యాషనైపోయింది.
తన కుమారుడు రణబీర్ కపూర్‌కు బాలీవుడ్ నటిని భార్యను చేసేందుకు ససేమిరా అంటున్న నీతూ సింగ్ కపూర్, ఓ లండన్ అమ్మాయిని చూసేందుకు కొడుకుతో సహా లండన్ వెళ్లినట్టు తెలుస్తోంది. బిటౌన్ వార్తల ప్రకారం లండన్‌కు చెందిన ఓ వ్యాపార దిగ్గజం కుమార్తెతో రణ్ బీర్ పెళ్లి చూపుల కార్యక్రమం ఉందని... అందుకే నీతూ, ఆర్కే లండన్ ఫ్లైట్ ఎక్కేశారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
నీతూ దగ్గరి సన్నిహితులు ఈ సంబంధాన్ని ఖరారు చేశారని.. దాదాపు అంతా ఖరారైనట్టేనని టాక్ వస్తోంది. గతంలో దీపికా పదుకునే, కత్రీనాతో లవ్వాయణం జరిపిన రణ్ బీర్ కపూర్.. ప్రస్తుతం లండన్ అమ్మాయిని పెళ్లాడుతాడా లేదా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.