ఇక ఆ తర్వాత రకరకాలుగా కొందరు స్టేట్‌మెంట్స్ ఇస్తూ వచ్చారు. తాజాగా `మా`కు సంబంధంలేని ఓ వ్యక్తి, చిత్రపురికాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవలే ఇతనిపై వందలకోట్ల రూపాయల కుంభకోణం వుందని సొసైటీ కోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఆయన తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు కూడా.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ కోసం ఫిలిం ఛాంబర్ ప్రాంగణ స్థలాన్ని ఉపయోగించుకోవాలని తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ అన్నారు. ఫిలిం ఛాంబర్ ప్రాంగణంలో ఉన్న రామానాయుడు కళ్యాణమండపం ముందు ప్రాంతంలో హైరైజ్ బిల్డింగ్ కట్టుకోవచ్చని, ఆ బిల్డింగ్ లో మా అసోసియేషన్ ఆఫీస్ తో పాటు 24 క్రాఫ్టుల కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చని అనిల్ కుమార్ సూచించారు. ఇలా చేస్తే మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా ఒక చోట ఉన్నట్లు అవుతుందని ఆయన చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో హీరోలు, పెద్దలంతా కలిసి ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటే మా అసోసియేషన్ తో పాటు ఇతర అసోసియేషన్ ల బిల్డింగ్ ల సమస్య తీరుతుందని వల్లభనేని అనిల్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ఇండస్ట్రీకి పెద్ద దిక్కులాంటి మెగాస్టార్ చిరంజీవి గారు ముందుకు రావాలని అనిల్ కుమార్ కోరారు.
ఛాంబర్ స్థలంపై వివాదం
అయితే ఛాంబర్‌లో గల రామానాయుడు కళ్యాణమండపం ముందు స్థలం వివాదంలో వుంది. హౌసింగ్ సొసైటీ కింద వున్న ఆ స్థలం పార్కింగ్ ప్లేస్‌గా వుంది. ఛాంబర్‌లోని కింది భాగమంతా వాణిజ్యసముదాయాలకు అద్దెకు ఇచ్చారు. ఇది సొసైటీ రూల్‌కు విరుద్ధం. ఇది ఎప్పటినుంచో వివాదంలో వుంది. అలాంటి స్థలాన్ని అనిల్ అనే వ్యక్తి కలుగజేసుకోవడం సరికాదని ఛాంబర్ వర్గాలు తెలియజేస్తున్నాయి.
బిల్డింగ్ వద్దన్న బండ్ల గణేష్
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మా ఎన్నికలపై తనదైన శైలిలో హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మా కు శాశ్వత భవనం నిర్మించాల్సిన అవసరం లేదని ఓ యూట్యబూబ్అ ఇంటర్వూలో తెలిపారు.మా అసోసియేషన్ లో సుమారు 900 మందిలో చాలా వరకూ దారిద్యరేఖకు దిగువన ఉన్నారు. వారి ఆర్థిక పరిస్థితి బాగాలేక ఎంతో మంది కష్టాలు పడుతున్నారు. నా ఉద్దేశం ప్రకారం, బిల్డింగ్ నిర్మాణం కోసం ఖర్చు చేసే రూ.20 కోట్లతో పేద కళాకారులందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి, ఉచితంగా ఇస్తే బాగుంటుందని బండ్ల తెలిపారు. మాకి బిల్డింగ్ అత్యవసరం కాదని, అది లేకపోతే ఇండస్ట్రీ ఆగిపోదు.. సినిమాలు చూసే వాళ్లు తగ్గిపోరు అని బండ్ల గణేష్ కామెంట్ చేశారు. కాగా, ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు బండ్ల గణేష్ మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.