ఆ సినిమా మ‌హేష్‌బాబు చేస్తే ఎలా వుండేది!

శుక్రవారం, 12 మార్చి 2021 (20:31 IST)
mahesh babu still
మ‌హేష్‌బాబు సినిమా చేయ‌డం అంటే నిర్మాత‌ల‌కు పెద్ద ఆఫ‌ర్ అనే చెప్పాలి. హీరో డేట్స్‌ను బ‌ట్టి ర‌చ‌యిత క‌థ రాయ‌డం, నిర్మాత సెట్‌చేయ‌డం మామూలే. పెద్ద బేన‌ర్ అయిన స‌రే ఒక్కోసారి క‌థ‌ను బ‌ట్టే ఫాలో అవుతుంటారు. అలాగే 14రీల్స్ ప్ల‌స్ సంస్థ `శ్రీ‌కారం` సినిమా తీసింది. శ‌ర్వానంద్ హీరో. ఆ చిత్రం మొద‌టి ఆట ఆశించిన క‌లెక్ష‌న్లు రాబ‌ట్ట‌లేక‌పోయింది. కానీ మార్నింగ్ షో త‌ర్వాత నుంచి క్ర‌మేణా క‌లెక్ష‌న్లు పెరుగుతున్నాయి. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాత‌లే వెల్ల‌డించారు. ఇంత‌కుముందు శ‌ర్వానంద్ సినిమాకంటే బాగానే వ‌సూలు చేసింద‌ని అంటున్నారు. అయితే ఈ సినిమా విడుద‌ల‌కు ముందు మ‌హేష్‌బాబు చేసిన `మ‌హ‌ర్షి` సినిమాతో సినీపెద్ద‌లు పోల్చారు.

కానీ విడుద‌ల త‌ర్వాత దానికి దీనికి చాలా వ్య‌త్యాసం వుంది. హీరో నేప‌థ్యం సాఫ్ట్‌వేర్ మాత్ర‌మే. ఫ్రెండ్ కోసం ఊరుకు వ‌చ్చి పంట‌పొలాల‌ను, ఫ్రెండ్‌ను కాపాడ‌తాడు మ‌హేష్‌బాబు. కానీ శ్రీ‌కారం అలాకాదు. పంట‌లు స‌రిగ్గా పండ‌క‌, అప్పులు పెరిగి ఒట్టిపోతున్న ప‌ల్లెలను శ‌ర్వానంద్ ఎలా ప‌చ్చ‌ద‌నం తీసుకువ‌చ్చాడ‌నేది పాయింట్‌. ఇది ఒక‌ర‌కంగా చెప్పాలంటే మ‌హ‌ర్షి సినిమాకు కొన‌సాగింపుగా వుంటుంది. ఈ క‌థ‌ను మ‌హేష్‌బాబుతో తీయాల‌నే నిర్మాత‌ల‌కు ఆలోచ‌న వ‌చ్చిందట‌. కానీ పెద్ద హీరో డేట్స్ ఇత‌ర‌త్రా స‌మ‌స్య‌ల వ‌ల్ల రిలీజ్ మ‌రింత ఆల‌స్యం అవుతుంద‌ని భ‌య‌ప‌డ్డార‌ట‌. ఇప్పుడు అలాంటి హీరోతో చేస్తే మ‌రింత‌గా చెప్పాల్సిన మెసేజ్ బాగా చేరేద‌ని భావిస్తున్న‌ట్లు తెలిసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు