అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో స్త్రీ ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటూ మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన తల్లి, సతీమణి, కూతురు ఫొటోను షేర్ చేస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అద్భుతమైన మహిళలందరికీ, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఎప్పుడు అత్యున్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను అని ట్వీట్‌లో పేర్కొన్నారు.