నాగార్జున సరసన నడుము సుందరి.. ప్రవీణ్ భలే ఆఫరిచ్చాడట!

గురువారం, 2 జులై 2020 (20:02 IST)
Ileana-Nagarjuna
అక్కినేని నాగార్జున సరసన నడుము సుందరి ఇలియానా నటించనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. బాలీవుడ్‌లో అజయ్ దేవగన్, ఇలియానా నటించిన 'రైడ్' మూవీని టాలీవుడ్‌లో రీమేక్ చేయాలనుకుంటున్నారట ప్రవీణ్. ఈ చిత్రంలో నాగ్ హీరోగా, ఇలియానాను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
ఇప్పటికే ఇలియానాకు బాలీవుడ్‌లో ఆఫర్లు అంతంతగా మాత్రంగానే వున్నాయి. ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమాయణం కూడా బ్రేకప్ అయ్యింది.  దీంతో ఆమె కన్ను మరోసారి టాలీవుడ్‌పై పడింది. ఈ క్రమంలోనే ఇటీవలే 'అమర్ అక్బర్ ఆంటోనీ' మూవీతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చేసింది. దీంతో సీనియర్ హీరోలకు ఈ భామ బెటర్ ఛాయిస్ అనే టాక్ బలపడింది. ఇందులో భాగంగా ప్రవీణ్ ఇలియానాను సంప్రదించి ఈ సినిమాకు రైడ్ రీమేక్‌కు ఓకే చేశాడని తెలుస్తోంది. 
 
నడుము అందాలకు పెట్టిన పేరు ఇలియానా. వైవిఎస్ చౌదరి పరిచయం చేసిన అందం ఇలియానా. దేవదాస్ మూవీతో కుర్రకారును పోకిరిలను చేసి.. యూత్‌తో జల్సా చేయించింది. ఆ తరువాత టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా క్రేజ్ దక్కించుకుంది. తెలుగులో కోటి రూపాయల పారితోషికం తీసుకున్న మొదటి నటిగా వార్తల్లోకి ఎక్కింది. 
 
టాలీవుడ్‌లో అంత క్రేజ్ ఉన్న సమయంలో బాలీవుడ్ బాట పట్టింది ఈ స్లిమ్ బ్యూటీ. కానీ అక్కడ అంతగా కలిసిరాలేదు. ఈ నేపథ్యంలో మళ్లీ టాలీవుడ్‌లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇల్లీ బ్యూటీ నాగార్జునతో చేసే సినిమా ద్వారానైనా హిట్ కొడుతుందో లేదో వేచి చూడాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు