సర్కారు వారి పాట పాన్ ఇండియా మూవీనా?

సోమవారం, 7 సెప్టెంబరు 2020 (20:29 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు - యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్- 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ భారీ, క్రేజీ మూవీలో క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్‌ నటిస్తుంది. ఈ సినిమాని ఎనౌన్స్ చేసారు కానీ.. షూటింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు.
 
డైరెక్టర్ పరశురామ్ మాత్రం షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీనే... కాకపోతే కరోనా కారణంగా మహేష్‌ బాబు ఇంకా ఓకే చెప్పలేదు. అక్టోబర్ ఎండింగ్ లేదా నవంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు వచ్చినప్పటి నుంచి అభిమానుల్లో మరింత ఆసక్తి ఏర్పడింది.
 
ఎందుకంటే.. మహేష్ బాబు ఇప్పటివరకు పాన్ ఇండియా మూవీ చేయలేదు. అందుచేత ఇది పాన్ ఇండియా మూవీ అనే వార్త వచ్చేసరికి ఎంతో ఆత్రుతగా అఫిషియల్ కన్ఫర్మ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో విలన్ పాత్రను బాలీవుడ్ సీనియర్ హీరోతో చేయించాలి అనుకుంటున్నారట. ప్రస్తుతం ఆ హీరోతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది. మరి... నిజంగానే ఇది పాన్ ఇండియా మూవీగా ఎనౌన్స్ చేస్తే ఫ్యాన్స్‌కి పండగే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు