ప్రభాస్‌తో మారుతీ సినిమా.. రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్

బుధవారం, 1 నవంబరు 2023 (09:30 IST)
కమర్షియల్ డైరెక్టర్ మారుతీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో భారీ పాన్ ఇండియా మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై ఇప్పటికే పలు రూమర్స్ వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తోంది.
 
ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో విజువల్స్ అద్భుతంగా ఉంటాయని, ముఖ్యంగా ప్రభాస్ గెటప్, సెటప్ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటాయని తెలుస్తోంది. 
 
ఈ క్రమంలో యాక్షన్‌ సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయని సన్నిహితులు చెబుతున్నారు. అలాగే ఇదొక మాస్ మసాలా ఎంటర్‌టైనర్ అని, ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారని తెలుస్తోంది. ఇది ప్రభాస్‌కు పూర్తిగా కొత్త జానర్ అవుతుంది. ప్రస్తుతం ప్రభాస్ తన మరో చిత్రం సలార్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు