దేవదాసు సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం బాలీవుడ్‌కు మకాం మార్చేసిన గోవా బ్యూటీకి రహస్యంగా వివాహమైందనే పుకార్లు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. హీరోయిన్‌గా ఆఫర్లు సన్నగిల్లడంతో బుల్లితెరపై నటించేందుకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ఇలియానా.. క్రిస్ మస్ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేసింది. ఈ ఏడాది తనకు ఇష్టమైన సమయం ఇదని తెలిపింది.
క్రిస్మస్ అంటే తనకెంతో ఇష్టమని, కుటుంబ సభ్యులతో సెలవులు గడపడం సంతోషంగా ఉంటుందని పోస్ట్ చేసింది. తాను షేర్ చేసిన ఫొటో తన భర్త ... హబ్బీ.. ఆండ్రూ తీశాడని పేర్కొంది. అతడితో పెళ్లిపోయింది కాబట్టే ఆండ్రూను భర్తగా సంబోధించిందని అభిమానులు ఫ్యాన్స్ అంటున్నారు. దీంతో వీరిద్దరికీ రహస్యంగా వివాహం జరిగిందని జోరుగా ప్రచారం అవుతోంది. 2014లో కెమెరాకు చిక్కిన ఈ జంట ప్రస్తుతం సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే.