జనసేన ప్రచారకర్తగా సప్తగిరి...

శుక్రవారం, 26 మే 2017 (15:50 IST)
జనసేన. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్‌ హాట్ టాపికే. పవన్ ఎప్పుడు మీడియా సమావేశం పెట్టినా అధికార పక్షానికి భయమే. ఎప్పుడు ఏం మాట్లాడి ప్రజల్లో తమ విలువను పోగొట్టే ప్రయత్నం చేస్తారన్నదే అధికార పార్టీ నేతల భయం. అందుకే ఎప్పుడూ పవన్ కళ్యాణ్‌ ఏ విషయం చెప్పినా వెంటనే స్పందించి ఆ సమస్యలపై దృష్టి సారిస్తుంటారు. ఇప్పటికే జనసేనానిలోకి చాలామంది వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. పాత రాజకీయ నాయకులను పవన్ కళ్యాణ్‌ పార్టీలో చేర్చుకోవడం లేదు. ఇది తెలిసిందే.
 
సినీ రంగం నుంచి ఇప్పటికే యువ నటులు జనసేనలోకి వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు. అందులో 'భీమవరం బుల్లోడు' సునీల్ మొదటగా ఉన్నారు. ఆయన ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. ఇక అదే కోవలోకి నటుడు సప్తగిరి కూడా ఉన్నారు. సప్తగిరి ఈ పేరు తెలియని వారండరు. బ్రహ్మాంనందం తర్వాత అంతటి పేరు వచ్చిన కమెడియన్‌లో ఈయన ఒకరు. ఈయన స్క్రీన్‌పై కనిపిస్తే చాలు తెలుగు ప్రేక్షకులు ఈలలు గోలలు. సప్తగిరికి పవన్ కళ్యాణ్‌ అంటే ప్రాణం. తాను హీరోగా నటించిన 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' ఆడియో ఫంక్షన్‌కు పవన్ కళ్యాణ్‌‌ను పిలిచి మరీ గౌరవించారు. 
 
అలాంటి వ్యక్తిని జనసేనలోకి తీసుకోవాలన్నది పవన్ ఆలోచన. ఇదే విషయాన్ని ఫోన్ ద్వారా పవన్ సప్తగిరికి చెప్పారట. దేవుడితో పవన్‌ను సమానంగా భావించే సప్తగిరి ఆయన చెబితే ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నారట. పవన్ చెప్పగానే మీరు ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాను.. ప్రచారం చేయడానికి కూడా అంతే సిద్ధంగా ఉన్నానని చెప్పారట. మొత్తం మీద యువనటులందరూ జనసేలోకి క్యూకడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి