దేశంలో పెద్ద నోట్ల రద్దుపై సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో చర్చతో పాటు సెటైర్లు కూడా పేలుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకుల వద్ద సాధారణ ప్రజానీకంతో పాటు తాము కూడా పడుతున్న కష్టాలను నెటిజన్లు ఏకరవు పెడుతున్నారు. అదేసమయంలో పెద్ద నోట్ల రద్దుతో పాటు.. దేశ వ్యాప్తంగా నెలకొన్న చిల్లర కొరతపై కూడా తమదైనశైలిలో ట్విట్టర్, వాట్సాప్‌లలో సెటైర్లు వేస్తున్నారు. ఆ సెటైర్లలో కొన్నింటిని పరిశీలిస్తే..
ప్రభాస్ "బాహుబలి" చిత్రంలోని ఓ డైలాగ్‌కు పేరడీ...
"నేను ఎప్పుడూ చూడని కళ్లు, నన్ను ఆశగా చూస్తున్నాయి, నేను ఎవర్ని? బాహుబలి ప్రశ్న’’.
పవన్ కళ్యాణ్ "అత్తారింటికి దారేది" చిత్రంలోని డైలాగ్‌కు పేరడీ...
‘‘రెండు వేల నోటు ఎక్కడ తీసుకోవాలో కాదు, ఎక్కడ మార్చుకోవాలో తెలిసినోడు గొప్పోడు..!’’
‘‘బాగా ఉండటం అంటే వంద వెయ్యినోట్లు ఉండటం కాదత్తా, పది వంద నోట్లు ఉండటం.’’
‘‘అవినీతి నోట్లకట్టలో లేదు! వ్యవస్థలో ఉంది. అవినీతికర వ్యవస్థను కాపాడుతూ, నోట్లను మార్చినంత మాత్రాన ఒరిగేదేంటి?’’ శ్రీనివాస్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి సోషల్ మీడియా ద్వారా సంధించిన ప్రశ్న!
‘‘నల్లధనం నిరోధించడానికి ఏ చర్యైనా చేపట్టవచ్చు? అయితే సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా! ప్రజలంటే గౌరవం, బాధ్యత ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది!’’ విశ్రాంత ఉద్యోగి వెంకట కృష్ణ అభిప్రాయం!