మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్‌లో ఇప్పటి వరకు చాలా మంది హీరోలుగా పరిచయం అయ్యి సక్సెస్‌గా దూసుకెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కుటుంబం తొలిసారిగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది నిహారిక. ఆమె నటించిన ''ఒక మనసు'' సినిమా విడుదలై డిజాస్టర్ టాక్‌ని సొంతం చేసుకుంది. సినిమా టాక్ ఎలా ఉన్నా ఒక మనసులో నిహారిక నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.
మరోవైపు నిహారిక టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌తో నటించేందుకు సై అంటోంది. అంతేకాదు ఎన్టీఆర్‌తో ఛాన్స్ వస్తే తాను హీరోయిన్‌గా చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పి సంచలనం రేపింది. ఆమె ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో... మీరు ఎవరితో నటించేందుకు ఆసక్తి చూపిస్తారని అడిగిన ప్రశ్నకు జవాబుగా.. పవన్ బాబాయ్ సినిమాలో ఛాన్స్ వస్తే అంతకన్నా ఆనందం మరొకటి లేదు.
అలాగే చరణ్, వరుణ్ అన్నయ్యల సినిమాల్లో నటిస్తానని చెపుతూనే ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ వస్తే నటిస్తానని చెప్పి నందమూరి అభిమానులకు షాక్ ఇచ్చింది. అందుకోసం ఎప్పటి నుంచో కలగంటున్న తన డ్రీమ్‌ను నెరవేర్చుకోవడానికి తన తండ్రి నాగబాబును బాగా డిస్టర్బ్ చేస్తుందంట. తారక్ సినిమాలో ఎలాగైనా సరే తనకు హీరోయిన్‌గా చాన్స్ ఇప్పించాలని తండ్రిని వేడుకుంటుందట. మరి ఆమె కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.