నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కొత్త గెటప్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రం లుక్ ఒకటి తాజాగా విడుదలైంది. ఇది సినీ ప్రేక్షకులను భయపెట్టేలా ఉంది. ఈ లుక్ బాబీ దర్శకత్వం వహిస్తున్న జై లవకుశ చిత్రంలోనిది. ఈ సినిమాలో మూడు పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఒకటి విలన్ పాత్ర కావడం గమనార్హం. ఆ నెగిటివ్ రోల్‌కు సంబంధించి ఎన్టీయార్ గెటప్ ఈ ఫోటోలో చూపించిన విధంగా ఉండబోతోందట.
‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ వంటి హాలీవుడ్ సినిమాకు పనిచేసిన మేకప్‌మేన్ వాన్స్ గార్ట్‌వెల్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. ఆయనే ఎన్టీయార్ పోషించబోయే విలన్ పాత్ర కోసం ఈ మాస్క్‌ను రూపొందించాడట. చూడడానికే భయంకరంగా ఉన్న ఈ మాస్క్‌లో ఎన్టీయార్ ఎలా అదరగొడతాడో చూడాలి. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.