లింగ, కబాలి, కాల ఇలా వరుస ఫ్లాప్‌లు రజినీకాంత్‌కు వస్తున్నా ఆయన మాత్రం సినిమాలు తీయడంలో వెనుకడుగు మాత్రం వేయడం లేదు. ఒక సినిమా చేస్తూనే మరో రెండు, మూడు సినిమాలకు సంతకాలు చేసేస్తున్నారు. తాజాగా 2.0 సినిమా చేస్తుండగా రజినీ మరో కొత్త సినిమాకు సంతకం చేసేశారు. ఆ సినిమాలో హీరోయిన్ ఎవరో కాదు కాజల్ అగర్వాల్.
తెలుగు, తమిళ చిత్ర సీమలో కాజల్ అగర్వాల్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అగ్ర హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించారు కాజల్ అగర్వాల్. కాజల్ ఏ సినిమాలో నటించినా ఆ సినిమా ఖచ్చితంగా హిట్టవుతుందని ఆమె అభిమానుల నమ్మకం. అందుకే కాజల్ అదృష్టాన్ని తనవైపు తిప్పుకుని వరుసగా ఫ్లాప్‌లు అవుతున్న తన సినిమా జాబితాలోకి హిట్‌ను చేర్చాలన్న ఆలోచనలో రజినీ ఉన్నారట.
నటిస్తున్న సినిమాలకు సంతకాలు పెట్టి అడ్వాన్స్ కూడా తీసుకొంది కాబట్టి ఇక ఏంచేయాలో పాలుపోని స్థితిలో ఉందట కాజల్. దీంతో రజినీకాంత్ స్వయంగా ఫోన్ చేసి మన సినిమా షూటింగ్ ఎక్కువ రోజులు ఉండదు. నీ క్యారెక్టర్ తక్కువ సేపు ఉంటుంది. రోజులు కూడా తక్కువే కాబట్టి ఏం టెన్షన్ పడొద్దు. హాయిగా షూటింగ్‌కు రా అని చెప్పారట. ప్రస్తుతానికి కాజల్ షూటింగ్‌కు వెళ్ళడానికి సిద్థంగా ఉంది కానీ ఎప్పుడు సినిమా స్టార్ట్ అవుతోంది మాత్రం క్లారిటీ లేదట.