మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ సినిమాలో రొమాన్స్ చేసిన కాజల్ అగర్వాల్.. తమిళ హీరో అజిత్ వివేగంలో నటిస్తోంది. అజిత్‌తో జతకట్టడంపై ఎంతో ఖుషీ ఖుషీగా ఉన్న కాజల్ అగర్వాల్.. అందగాడైన అజిత్‌ను పొగిడేస్తోంది. ఈ సినిమాలో అచ్చం తమిళమ్మాయిగా కనిపించేందుకు కాజల్ అగర్వాల్ ఎంతో కష్టపడినట్లు చెప్పింది. అజిత్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో హ్యాపీగా ఉందని చెప్పింది.
వాన పాట చేసే ఆఫర్ వస్తే కాజల్ ఒప్పుకుందట. అయితే ఓ కండిషన్ పెట్టిందట. వాన పాట చిత్రీకరించేటప్పుడు కెమెరామెన్, టాప్ మోస్ట్ టెక్నీషన్లు తప్ప ఎవరూ ఉండకూడదని చెప్పిందట. నిర్మాత కూడా ఓకే చెప్పాడట. అయితే కొరియోగ్రాఫర్ వాన పాట సెట్‌లో లేకుంటే అమ్మడు ఎలా చిందులేస్తుందని సినీ జనం అనుకుంటున్నారు.