నిజానికి కల్యాణ్ రామ్‌కు బ్యాడ్‌టైమ్ నడుస్తుందనే చెప్పాలి. 'పటాస్' హిట్‌తో ఫామ్‌లోకి వచ్చిన కల్యాణ్ రామ్ ఆ తర్వాత ఆర్థికంగా నష్టపోయాడు. 'పటాస్' తర్వాత ఆయన నటించిన 'షేర్' పరాజయం పాలైంది. ఈ చిత్రం లోబడ్జెట్ సినిమా కావడంతో ఆయన ఇబ్బంది పడలేదు. కానీ రవితేజ హీరోగా కళ్యాణ్ రామ్ నిర్మాతగా నిర్మించిన చిత్రం 'కిక్-2'. ఈ చిత్రం తీవ్రమైన నష్టాలను మిగిల్చింది.
'ఇజం' సినిమా బడ్జెట్ దాదాపు రూ.26 కోట్లు. ఇంత భారీ బడ్జెట్ చిత్రం తీయడానికి హీరో సాహసం చేయలేదు. కానీ, పూరీ బలవంతపెట్టడంతో ఇంత బడ్జెట్‌తో చిత్రాన్ని పూర్తి చేయాల్సి వచ్చిందట. అదేసమయంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సైతం కల్యాణ్ రామ్ నానా తిప్పలు పడ్డారు.