సోషల్ మీడియాలో డైమండ్ రింగ్ ఉన్న ఫోటో: అందుకే కిమ్ కర్దాషియాన్‌ను దోచుకున్నారు..

బుధవారం, 5 అక్టోబరు 2016 (16:39 IST)
ప్రముఖ టీవీ రియాల్టీ స్టార్‌ కిమ్‌ కర్దాషియాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. పారిస్‌లో ఆమె బస చేస్తున్న హోటల్‌లో ఆమె పెను ప్రమాదం నుంచి బయటపడింది. సోమవారం తెల్లవారుజామున కిమ్‌ గదిలోకి ఇద్దరు దుండగులు పోలీసులమంటూ చొరబడ్డారు. ముసుగులు వేసుకొని వచ్చిన వారు కిమ్‌కు తుపాకీ గురి పెట్టి.. ఆమె వద్దనున్న మిలియన్‌ డాలర్ల విలువైన నగల్ని దోచుకెళ్లిన విషయం తెలిసిందే. 
 
అయితే ఆమె తన జ్యూవెలరినీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతోనే దొంగలు దోపిడీకి పాల్పడ్డారని అధికారులు వెల్లడించారు. నాలుగురోజుల క్రితం తన చేతికి ఉన్న డైమండ్ రింగ్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందీ భామ. దీంతో సోమవారం ఉదయం 2.30 గంటలకు పారిస్‌లోని ఫ్యాషన్ వీక్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు పోలీస్ దుస్తుల్లో వచ్చిన ఇద్దరు దుండగులు కిమ్ బస చేసిన హోటల్ రూమ్ కనుక్కొని ఆమెని గన్నుతో బెదిరించి 40 కోట్ల రూపాయలు విలువ చేసే ఆభరణాలు దోచుకెళ్ళారు. 
 
అంతర్జాతీయంగా బాగా పాపులర్ అయిన ఓ సెలబ్రిటీని దోపిడీ చేయడానికి ముందుగానే ప్లాన్ చేసుకున్నారని పోలీస్ శాఖ అధికార ప్రతినిధి జొహానా తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు విషయమై విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి