బాయ్‌ఫ్రెండ్స్‌ లేరట... గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువంటోంది...

బుధవారం, 6 జులై 2016 (20:01 IST)
హీరోయిన్లకు బాయ్‌ఫ్రెండ్స్‌ వుండటం కామన్‌. చాలామంది బాయ్‌ఫ్రెండ్స్‌కు దూరంగా వున్నా.. నటి లావణ్య త్రిపాఠికి అస్సలు బాయ్‌ఫ్రెండ్సే లేరట. కానీ.. మంచి గాళ్‌ఫ్రెండ్స్‌ వున్నారంటూ చెబుతోంది. అనుష్క, సమంత, నిత్యామీనన్‌లు నటన అంటే ఇష్టమని.. చెబుతోంది. ఇంకా పలువురు గాళ్‌ఫ్రెండ్స్‌ వున్నారనీ.. హైస్కూలు, కాలేజీ నుంచి వున్న ఫ్రెండ్స్‌తో ఖాళీ సమయంలో గడుపుతామని చెబుతోంది. 
 
భలేభలే మగాడివోయ్‌, సోగ్గాడే చిన్నినాయనా.. చిత్రాలు తర్వాత మరిన్ని అవకాశాలు వస్తాయని భావించింది. కానీ.. ఆమెకు తమిళంలో అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌ చిత్రంలో చేస్తుంది. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో చెబుతానని తెలియజేస్తుంది.

వెబ్దునియా పై చదవండి