దేశ రాజధానిని వణికించిన భూకంపం.. ప్రజలు రోడ్లపైకి పరుగో పరుగు

ఠాగూర్

గురువారం, 10 జులై 2025 (10:14 IST)
దేశ రాజధాని ఢిల్లీని భూకంపం వణికించింది. ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో గురువారం ఉదయం బలమైన భూప్రకంపనలు సంభవించాయి. కొన్ని సెకన్ల పాటు భూమి బలంగా కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నివాసాలు, కార్యాలయాల్లో ఉన్నవారు ఏ జరుగుతుందో తెలియక ఆందోళనతో బయటకు పరుగులు తీశారు. 
 
ఈ భూకంపం కేంద్రం హర్యానాలోని రేవారి జిల్లాలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. రేవారి జిల్లా పరిధిలోని గురవార అనే ప్రాంతం సమీపంలో భూకంపం సంభవించినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు.
 
భూకంప కేంద్రం హర్యానాలో ఉన్నప్పటికీ దాని ప్రభావం మాత్రం ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్ వంటి జాతీయ రాజధాని ప్రాంతం అంతటా స్పష్టంగా కనిపించింది. ఈ భూకంపం ప్రభావం వల్ల సంభవించిన ఆస్తి, ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు