నేను చూపించేందుకు సిద్ధం... నా కోరిక ఎవరు తీరుస్తారు...

సోమవారం, 8 మే 2017 (15:46 IST)
టాలీవుడ్‌కు చెందిన మరో హీరోయిన్ అందాలు ఆరబోసేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు ఆమె నటించిన చిత్రాల్లో ఆ హీరోయిన్ పదహారణాల తెలుగు అమ్మాయిగా కనిపించింది. కానీ, ఇపుడు అందాలు ఆరబోసేలా టూ పీస్ దుస్తుల్లో నటించేందుకు సై అంటోంది. ఆమె ఎవరో కాదు లావణ్య త్రిపాఠి. 
 
'అందాల రాక్షసి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ... ఇపుడు బికినీ వేయాలని కోరికగా ఉందంటూ బాహాటంగా చెబుతోంది. తనకు మోడ్రన్‌ డ్రస్సులంటే ఇష్టమనీ, కానీ సినిమాల్లో మాత్రం తనను సంప్రాదాయబద్ధంగా చూపుతున్నారనీ, ఇక నుంచి మోడ్రన్ క్యారక్టర్లు ఇవ్వమంటూ దర్శకనిర్మాతలను ప్రాధేయపడుతోంది. 
 
ఇందుకోసం అవసరమైతే బికినీ కూడా వేసుకుంటానని బాహాటంగా ప్రకటించింది. లావణ్య కోరిక విన్న దర్శకనిర్మాతల మాత్రం బికినీ గురించి ఆలోచించడం లేదట. దీనికి కారణం లేకపోలేదులేండి. లావణ్య మోడ్రన్‌ డ్రస్సులకూ, బికినీలకు సరిపోదన్నది కొందరి అభిప్రాయంగా ఉండటమే ఇందుకు కారణం. 

వెబ్దునియా పై చదవండి