మహేష్ బాబు, రాజమౌళి ఎస్.ఎస్.బి. 29 సినిమా తాజా అప్ డేట్

డీవీ

గురువారం, 24 అక్టోబరు 2024 (16:29 IST)
Maheshbabu
మహేష్ బాబు, రాజమౌళి ఎస్.ఎస్.బి. 29 సినిమా కోసం ఇప్పటికే పలు లొకేషన్లను వెతుకుతూ వున్న విషయం తెలిసిందే. తాజాగా రాజమౌళి ఫారెస్ట్ లో వెళుతూ వున్న చిన్నపాటి గ్లిప్పింగ్ లాంటి వీడియోను రాజమౌళి కొడుకు కార్తికేయ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆఫ్రికన్‌ అడ్వెంచరస్‌ ప్రాజెక్ట్‌గా ఇంటర్నేషనల్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతోందని తెలిసిందే. ఎస్.ఎస్. కార్తికేయ యాష్ టాగ్ లో  టక్కరి దొంగ సినిమా నుంచి నలుగురికీ నచ్చినదీ నాకు అసలే నచ్చనిది. అనే సాంగ్ వింటూ రాజమౌళి ఎంజాయ్ చేస్తున్న సీన్ అలరించింది.
 
భారతీయ చరిత్రలో రాజమౌళి పెద్ద సినిమాకు శ్రీకారం చుట్టారనే చెప్పాలి. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్. సినిమాలకు మించిన చిత్రంగా ఈసారి హాలీవుడ్ సినిమాను తీయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాను గతంలో సినిమాలు చేసి కొంతకాలం విరామం తీసుకున్న బిల్డర్, రియల్టర్ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్‌ నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం మహేష్ బాబు తన ఆహార్యాన్ని మార్చుకున్నారు.
 
గ్లోబల్‌ అడ్వెంచరస్‌ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ మూవీని చిత్రీకరిస్తున్నారు. కాగా, ఎస్‌ఎస్‌ రాజమౌళి ఈ సినిమా కోసం తొలిసారి ఏఐ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌) వినియోగించబోతున్నాడట. ఈ మేరకు ఏఐపై అవగాహన కోసం జక్కన్న ప్రత్యేక తరగతులకు కూడా హాజరవుతున్నట్టు సమాచారం. చిత్రంలో కథాప్రకారంగా కొన్ని పాత్రలు, జంతువులను సృష్టించేందుకు ఏఐ టెక్నాలజీని వాడబోతున్నారు. అయితే ఈ సినిమాను మూడేళ్ళపాటు తీయనున్నారు. 2027లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా బయటకు రానుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు