సెట్‌లో రచ్చరచ్చ చేసిన సితార... పగలబడినవ్విన యూనిట్
ఆదివారం, 9 జులై 2017 (11:46 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ముద్దుల కుమార్తె సితార. ఈ చిట్టుబుగ్గల చిన్నారి చేసే అల్లరి అంతా ఇంతాకాదు. ఎంతో చలాకీగా ఉండే సితార... తన తండ్రి సినిమాలోని పాటలకు స్పెప్పులేయడమే కాదు, డైలాగులను కూడా ముద్దుగా ముద్దుగా చెపుతూ ఉంటుంది.
ఇక మహేష్ మూవీ షూటింగ్ లొకేషన్‌కి వెళ్లి అక్కడ సితార చేసే సందడి టీ మెంబర్స్‌కి చాలా ఆనందాన్ని ఇస్తుంది. అయితే రీసెంట్‌గా మురుగదాస్ తెరకెక్కిస్తున్న "స్పైడర్" సినిమా షూటింగ్‌కి వెళ్ళిన సితార అక్కడ తండ్రితో కలిసి అనేక ఫోజులిచ్చింది. చిత్ర హీరోయిన్‌తో రకుల్‌తో సరదాగా గడిపింది.
వెంటనే ఈ సన్నివేశాలను చిత్ర సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ తన కెమెరాలో బంధించాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫ్యూచర్‌లో తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటుందని అభిమానులు చెబుతున్నారు.