టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు. ఆయన భార్య నమ్రతా శిరోద్కర్. ఒకప్పటి హీరోయిన్. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, ఇటీవల నమ్రతను చూసిన సినీ అభిమానులు ఒకింత షాక్‌కు గురయ్యారట. అంటే.. ఆమె వేసిన డ్రెస్ చూసిన వారంతా అవాక్కయ్యారు. ఎందుకంటే.. ఎపుడూ సంప్రదాయబద్ధంగా కనిపించే నమ్రత ఒక్కసారి.. మోడ్రెన్ దుస్తులు ధరించడమే ఇందుకు కారణం. ఆ దుస్తుల్లో నమ్రను చూడగానే ఆమె మిస్ ఇండియా పోటీలకు ఏమైనా వెళ్లిందా అనే సందేహం వారికి వచ్చిందట
నిజానికి హీరోయిన్గా ఉన్నప్పటికీ.. మహేష్ భార్యగా నమ్రత మారిన తర్వాత ఆమె తన లుక్ గురించి పట్టించుకున్న సందర్భాలు చాల తక్కువ. ఆ మధ్య తిరుపతిలో నమ్రత గుండు గీయించుకున్నారు కూడా. అయితే ఆ విషయాన్ని ఏమాత్రం దాచకుండా ఆరోజు తిరుపతిలో కొందరు మహేష్ అభిమానులు ఆమెకు ఫోటోలు తీస్తూ ఉన్నా ఆమె అభ్యంతరం చెప్పలేదు. అయితే ఆ సంఘటన తర్వాత తిరిగి నమ్రత బయట ఫంక్షన్స్‌కు వచ్చిన సందర్భాలు లేవు.
కానీ ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఒక మ్యారేజ్ ఫంక్షన్‌కు నమ్రత తన కొత్త లుక్‌తో బయటకు వచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. బ్లాక్ అండ్ రెడ్ డిజైనర్ వేర్లో డ్రెస్ చేసుకు వచ్చిన నమ్రతను చూడగానే మీడియా కెమెరాలు అన్ని ఆమె వైపు ఫోకస్ చేయడం మొదలుపెట్టాయి. రెడ్ అండ్ బ్లాక్ మిక్స్ చేసిన బాటమ్ నమ్రతకు భలే మ్యాచ్ అయింది అంటూ ఆ ఫంక్షన్‌కు వచ్చిన చాలామంది కామెంట్స్ చేసుకున్నట్లు టాక్.