ఈ సినిమాలో హీరోయిన్ కోసం చిత్ర యూనిట్ అన్వేషణ ముమ్మరంగా సాగుతోంది. అయితే, ఈ చిత్ర కథకు అనుగుణంగా కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావించింది. అలా అనుకున్నదే తడువుగా... హీరోయిన్, మలయాళ భామ మాళవికా మోహనన్‌ను సంప్రదించాయట. కానీ, ఈ అమ్మడు రవితేజ పక్కన నటించేందుకు సమ్మతించలేదు.
పైగా, తనను సంప్రదించిన వారితో సింపుల్‌గా నో చెప్పేసిందనే వార్తలు ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తున్నాయి. దీంతో మరో హీరోయిన్ వేటలో చిత్ర యూనిట్ నిమగ్నమైందట. ఇదిలావుంటే, రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న 'క్రాక్' సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇందులో మాత్రం శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.