హీరో మంచు విష్ణుకు తీవ్రగాయాలు.. ఐసీయులో అడ్మిట్

ఆదివారం, 30 జులై 2017 (14:01 IST)
కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు తనయుడు, టాలీవుడ్ హీరో మంచు విష్ణు షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డారు. మలేషియాలో జరుగుతున్న తన చిత్ర షూటింగ్ సమయంలో ఆయన ప్రమాదవశాత్తు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్రగాయాలు తగలడంతో తక్షణం స్థానికంగా ఉండే ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స చేసి ఐసీయూ వార్డులో ఉంచారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంపై నిలకడగా ఉన్నప్పటికీ... ఐసీయూలో అడ్మిట్ చేయడంతో కాస్త ఆందోళనగా ఉంది. 
 
నిజానికి విష్ణు ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ఓ కామెడీ సినిమా. అయినప్పటికీ ఆయన రిస్కీ షాట్స్‌లో స్వయంగా నటించేందుకు ఆసక్తి చూపి ప్రమాదంలో చిక్కుకున్నాడు. కాగా, 2003 సంవత్సరంలో 'విష్ణు' అనే చిత్రం ద్వారా చిత్రరంగ ప్రవేశం చేసిన మంచు విష్ణు.. 2004లో వచ్చిన 'సూర్య' చిత్రంలో తన నట ప్రతిభను కనపరిచారు. ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా వెండితెరపై రాణిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి