విశ్వసనీయ సమాచారం మేరకు, రెండు రోజులుగా శంకరపల్లిలోని గుంటూరు కారం సినిమా సెట్లో విశ్వసంభర షూట్ జరుగుతోంది. ఇందులో నటి సురభి మెగాస్టార్ చిరంజీవి సోదరిగా నటిస్తోంది. పెండ్లి జరిగే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈరోజు చిరంజీవి షూట్ కు విశ్రాంతి ఇచ్చారని తెలిసింది. గతంలోనే మోకాలు నొప్పికి ఆయన గురయ్యారు. తాజాగా రెండు రోజులుగా డాన్స్ వేయడంతో కొరియోగ్రాఫర్లు, డాక్టర్ల సూచన మేరకు ఈరోజు రెస్ట్ తీసుకున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో తమన్నాకూడా ఓ పాత్ర పోషిస్తోంది. ఆమెది ఐటెం సాంగా, క్యారెక్టరా తెలియాల్సి వుంది.