సపోటా తోటలో మైనర్ బాలికపై తుని టీడీపీ లీడర్ అత్యాచారయత్నం

సెల్వి

బుధవారం, 22 అక్టోబరు 2025 (12:25 IST)
Tuni tdp leader narayana rao
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. తునిలో వృద్ధ కీచకుడి బాగోతం బయటపడింది. మైనర్ బాలికపై టీడీపీ నేత తాటిక నారాయణ రావు అత్యాచారయత్నం చేశాడు. బాలికను హాస్టల్ నుంచి తీసుకుని వెళ్లి హంసవరం సపోటా తోటల్లో అత్యాచార యత్నం చేశాడు. 
 
తుని రూరల్ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై తాటిక నారాయణ రావు ఈ అకృత్యానికి దారి తీయడం స్థానికంగా కలకలం రేపింది. 
 
నారాయణరావు బాగోతాన్ని గుర్తించిన స్థానికులు.. వెంటనే స్పందించి మైనర్‌ను రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారా అనేది ఇంకా తెలియాల్సి వుంది. అయితే, హాస్టల్ నుండి మైనర్‌ను నారాయణరావు బయటకు తీసుకువెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కాకినాడ జిల్లా
కాకినాడ

*తునిలో వెలుగులోకి వచ్చిన వృద్ద కీచకుడి బాగోతం

*మైనర్ బాలికను అత్యాయత్నం చేసిన టిడిపి నేత తాటిక నారాయణ రావు.

*తుని రూరల్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలిక

*బాలికను హస్టల్ నుండి తీసుకుని వెళ్ళి హంసవరం సపోటా తోటల్లో అత్యాచార యత్నం pic.twitter.com/bvJF1UXX99

— VenkataReddy karmuru (@Venkat_karmuru) October 22, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు