నబా నటేశ్‌కు ఆ విషయంలో అంత సీనుందా...?

మంగళవారం, 16 జూన్ 2020 (17:39 IST)
కుర్రహీరోయిన్లతో నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చేసుకుంటోంది నబా నటాష్. తక్కువ టైంలో ఎక్కువ అవకాశాలు వస్తున్న హీరోయిన్లలో నబా మొదటి ప్లేస్‌లో ఉన్నారు. సీనియర్ హీరోలు కూడా నబాతో నటించేందుకు ఓకే అనేస్తున్నారట. దీంతో ఇప్పుడు నబా మీదే సినీ పరిశ్రమలో ప్రచారం మొత్తం సాగుతోంది.
 
తక్కువ టైంలో ఎక్కువ అవకాశాలా ఎలా సాధ్యమవుతోందని ఆశ్చర్యపోతున్నారు యువ హీరోయిన్లు. ఇప్పుడైతే ఏకంగా నితిన్, సాయితేజ్‌తో సోలో బ్రతుకే సో బెటర్, బెల్లంకొండ శ్రీనివాస్‌తో అల్లుడు అదుర్స్, రవితేజతో మరో సినిమా ఇలా చేతిలో సినిమాల మీద సినిమాలు నబా నటేష్‌కు ఉన్నాయి. 
 
పూజా హెగ్డే, రష్మిక వంటి స్టార్ హీరోయిన్లు అయితే కుర్ర హీరోలతో నటించడానికి ఇష్టపడటం లేదు. ఇదంతా నబాకు బాగా కలిసొస్తోంది. అవకాశాలు అలా తన్నుకొచ్చేస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు