అక్కినేని నాగచైతన్య, సమంత కలిసి ఏమాయ చేసావే, మనం, ఆటోనగర్ సూర్య చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న ఈ జంట మళ్లీ తెరపై జంటగా నటించనున్నారు. నిన్ను కోరి డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోన్న ఈ సినిమా ఈ నెలాఖరున సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో నాగచైతన్య స్పోర్ట్స్ పర్సన్‌గా నటిస్తున్నాడు. వీరిద్దరు పెళ్లైన జంటగా నటించనున్నారని సమాచారం.
ఇదిలావుంటే.. ఇదే స్టోరీ అంటూ ఒకటి బయటకు వచ్చింది. అది ఏంటంటే... నిన్నుకోరి సినిమాకి ఇది రివర్స్ అని. ఎలా అంటే.. చైతన్య, సామ్ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే... వీరి లైఫ్ లోకి చైతుని ప్రేమించానని ఓ అమ్మాయి వస్తుందట. ఆ అమ్మాయిని చైతు ఇంటికి తీసుకువచ్చి మేము ఎంత హ్యాపీగా ఉన్నామో చూడు అని చూపిస్తాడట. ఇది వింటుంటే నిన్ను కోరి సినిమాకి రివర్స్‌లా ఉందని తెలుస్తుంది.