అక్కినేని నాగచైతన్య ఓవైపు సవ్యసాచి, మరో వైపు శైలజారెడ్డి అల్లుడు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. మరో రెండు సినిమాలు ఓకే చేసాడు. నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా, బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. త్వరలో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాయి. ఇదిలా ఉంటే... చైతన్య ముంబై వెళ్లారు.
ఎందుకంటే... రెండు సినిమాలతో బిజీగా ఉన్న చైతు మరోవైపు యాడ్స్ కూడా చేస్తున్నాడు. అది కూడా సమంతతో కలిసి. యాడ్ షూట్ కోసం చైతన్య సమంతతో కలిసి ముంబాయి వెళ్లాడు. ఈ ఇద్దరూ షూట్ అయిపోయిన వెంటనే ముంబై రెస్టారెంట్‌లో సరదాగా సమయం గడిపారు. వర్క్‌ని, వీకెండ్‌ని బ్యాలెన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సమంత. ఈ జంట పెళ్లి తర్వాత తొలిసారి కలిసి శివ నిర్వాణతో చేస్తోన్న సినిమాలో నటించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.