టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే యాక్షన్ ఫిల్మ్ చేస్తున్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై అహిషోర్ సాల్మోన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ అందరిలో ఆసక్తిని కలిగించిందని చెప్పచ్చు. ఈ సినిమా మేకింగ్ కూడా చాలా.. కొత్తగా ఉంటుందని.. ఇక ఈ సినిమా అయితే.. ఆడియన్స్‌కి ఓ కొత్త సినిమా చూసిన ఫీలింగ్ కలిగిస్తుంది అంటున్నారు.
ఇదిలా ఉంటే.. నాగ చైతన్యతో పరశురామ్ సినిమా చేయాలనుకోవడం.. 14 రీల్స్ ప్లస్ సంస్థ ఈ సినిమాని నిర్మించాలనుకోవడం తెలిసిందే. ఈ సమ్మర్ తర్వాత ఈ సినిమాని ప్రారంభించాలి అనుకున్నారు. ఇంతలో.. పరశురామ్‌కి మహేష్ బాబు నుంచి కాల్ రావడం.. మహేష్ సినిమా చేద్దామని ఆఫర్ ఇవ్వడంతో చైతన్య సినిమాని పక్కన పెట్టి పరశురామ్ మహేష్‌తో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు.
నాగ్ - మహేష్ బాబు మధ్య మంచి అనుబంధం ఉంది. ఇంకా చెప్పాలంటే.. అక్కినేని ఫ్యామిలీ - ఘట్టమనేని ఫ్యామిలీ మధ్య మొదటి మంచి అనుబంధం ఉంది. అలాంటిది నాగ్ - మహేష్ మధ్య గ్యాప్ రావడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. ప్రచారంలో ఉన్న ఈ వార్తలపై నాగార్జున కానీ, మహేష్ కానీ స్పందించలేదు కానీ.. వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని జోరుగా వార్తలు వస్తున్నాయి. మరి.. నాగార్జున కానీ.. మహేష్ కానీ.. స్పందిస్తారేమో చూడాలి.