పెళ్లికి సిద్ధమైన నిత్యామీనన్?

సోమవారం, 18 జులై 2022 (22:25 IST)
మలయాళీ ముద్దుగుమ్మ నిత్యమీనన్ పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ వార్త ప్రస్తుతం వైరల్ కావడంతో ఈమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరు అంటూ పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు. 
 
నిత్యామీనన్ పెళ్లి చేసుకోబోయేది సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. ఈమె మలయాళంలో స్టార్ నటుడుగా కొనసాగుతున్న వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. 
 
ఈమె సినిమాలలోకి రాకముందు అతనితో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త స్నేహంగా మారిందని అయితే ఆ స్నేహం ప్రేమకు దారి తీయడంతో ఈమె పెళ్లి చేసుకోవాలని భావించినట్లు తెలుస్తోంది
 
మరి నిత్యమీనన్ పెళ్లి గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఆమె స్పందించాల్సి వుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు