టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్‌కు 'జెంటిల్‌మన్' హీరోయిన్ నివేదా థామస్ ఓ కండిషన్ పెట్టింది. టాలీవుడ్ కుర్ర హీరోలతో నటించాలంటే.. తనకు స్క్రిప్ట్ నచ్చాలనీ, అపుడే... గ్లామర్‌గా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. అయితే స్కిన్ షోకు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ సమ్మతించబోనని చెప్పుకొచ్చింది.
ఈ చెన్నై బ్యూటీ.. యంగ్‌హీరో నాని సరసన 'జెంటిల్‌మన్'లో నటించింది. ఈ ఒక్క చిత్రంతోనే తన ఫేట్‌ను మార్చుకుంది. దీంతో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కాల్‌షీట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు అవుతున్నాయట. స్టార్ హీరోలు, డైరెక్టర్లు సైతం నివేదాతో వర్క్ చేయడానికి అమితాసక్తిని చూపుతున్నారు.
దీపం ఉండగానే 'ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందం'గా.. ఏ హీరోయిన్ అయినా వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనుకుంటోంది. అదేసమయంలో టాలీవుడ్ హీరోలకు కొన్ని కండిషన్లు పెడుతోంది. 'జనతా గ్యారేజ్' తర్వాత ఎన్టీఆర్- వక్కంతం వంశీ కాంబినేషన్‌లో సెట్స్‌పైకి వెళ్లే సినిమా కోసం నివేదా థామస్‌ను దర్శకుడు కలిసినట్లు తెలిసిందే. అయితే స్క్రిప్ట్ నచ్చితే గ్లామర్‌గా కనిపించడానికి అభ్యంతరం లేదని.. కానీ స్కిన్ షో మాత్రం చేసేది లేదని ముఖం మీదే చెప్పేసిందట.