'త్వరలోనే వచ్చేస్తున్నా'.. తెలుగు సినిమాపై వినయ విధేయ భామ!

సోమవారం, 14 జూన్ 2021 (22:27 IST)
కైరా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. కానీ టాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రం ఆమె తెలుగు సినిమాల్లో ఎప్పుడు నటిస్తుందా అంటూ  ఎదురుచూస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా ద్వారా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చింది. కైరా.. తెలుగు సినీ పరిశ్రమకు ఎప్పుడు రిటర్న్ అవుతారని అడిగిన ప్రశ్నకు 'వినయ విధేయ భామ' 'త్వరలోనే' అంటూ గుడ్ న్యూస్ చెప్పింది.
 
ఇంతకీ కైరా 'ఎగ్జైటింగ్ అనౌన్స్ మెంట్ అన్నది ఏ మూవీ గురించి? 'ఎన్టీఆర్30' అంటున్నారు కొందరు ఫిల్మ్ నగర్ జనం. 'జనతా గ్యారేజ్' కాంబినేషన్ రిపీట్ చేస్తూ కొరటాల శివ, ఎన్టీఆర్ త్వరలోనే సినిమా స్టార్ట్ చేయబోతున్నారు. 'ఆర్ఆర్ఆర్' తరువాత ఎన్టీఆర్ నెక్ట్స్ అదే కాబోతోంది. అందులో తారక్ సరసన 'భరత్ అనే నేను' చిత్రంలో నటించిన కైరా యాక్ట్ చేయబోతోందట. అదే నిజమైతే కొరటాల డైరెక్షన్‌లో ఆమెకి ఇది రెండో సినిమా అవుతుంది. మరి ఇది కన్ఫార్మా అనేది వేచి చూడాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు