పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కిషోర్ పార్ధసాని దర్శకత్వంలో నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్న చిత్రం "కాటమరాయుడు". ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే అభిమానులను ఆలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన కథ లీక్ అయింది. ఆ కథేంటంటే...
ఈ చిత్ర తొలి టీజర్‌ను ఈ నెల 26న విడుదలచేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న పవర్‌పుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. కుటుంబ బంధాలతో పాటు వినోదం, సెంటిమెంట్, యాక్షన్ అంశాలకు ప్రాధాన్యముంటుందని తెలిపారు.