చిరు ఎక్కడ? చెర్రీ ఎక్కడ?... 150కి నేను రావట్లేదు: పవన్

గురువారం, 5 జనవరి 2017 (16:33 IST)
చెర్రీకి దూకుడు ఎక్కువని అంటుంటారు సినీజనం. ఆయన ఉన్నది ఉన్నట్లుగా ముఖం మీదే చెప్పేస్తుంటాడని అంటారు. ఐతే చిరంజీవి కాస్త డిఫరెంట్. ఎంత గందరగోళంలో వున్నప్పటికీ చాలా ప్రశాంతంగా మాట్లాడుతుంటారని అంటారు. ఇది సినీజనం చెప్పుకునే మాట. అదే జరిగింది. చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం 150 ప్రి-రిలీజ్ కార్యక్రమానికి సంబంధించి చెర్రీ ఆన్ లైన్లో మాట్లాడారు. 
 
ఆ సందర్భంగా కొందరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చినప్పుడు... ఆయనను పిలుస్తున్నాం అంటే సరిపోయేది. కానీ, పవన్ పిల్లాడు కాదు... పిలుస్తా... రావడం రాకపోవడం ఆయనిష్టం అని లోపల ఏది వుందో అదే బయటకు చెప్పేయడంతో అది కాస్తా రచ్చరచ్చ అయింది. చివరికి మెగాస్టార్ చిరంజీవి నొచ్చుకున్నట్లు చెప్పుకుంటున్నారు. 
 
ఈ క్రమంలో చిరు భార్య, పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించినట్లు చెప్పుకుంటున్నారు. ఇదంతా ఇలావుంటే ప్రి-రిలీజ్ కార్యక్రమానికి తను హాజరు కాలేనని పవన్ చెప్పినట్లు భోగట్టా. ఆ రోజున తను కాటమరాయుడు చిత్రం షూటింగులో వుంటానని, అందువల్ల రాలేనని చెప్పినట్లు సమాచారం. కానీ రావాలని నిజంగా వుంటే షూటింగ్ బ్రేక్ కొట్టి రాకూడదూ... రావచ్చు కదా. మరి ఎందుకు రావట్లేదో...??

వెబ్దునియా పై చదవండి