స్టార్ హీరోయిన్ పూజా హెగ్దేని చంపేస్తామంటూ బెదిరింపులు, దుబాయ్‌లో గొడవే కారణమా?

గురువారం, 14 డిశెంబరు 2023 (11:47 IST)
ఈమధ్య టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్దేపై ఓ డేంజర్ వార్త హల్చల్ చేస్తోంది. ఆమెను చంపేస్తామంటూ కొందరు బెదిరిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తను పాపులర్ ఫోటోగ్రాఫర్ తన సోషల్ మీడియా పేజీలో పెట్టడంతో ఈ అనుమానం మరింత బలపడినట్లయింది. ఇంతలో ఆ పోస్టును డిలిట్ చేసేసారు. ఈ గందరగోళం పోస్టుతో పూజా హెగ్దే అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
 
ఐతే దీనిపై పూజా హెగ్దే టీమ్ సభ్యులు అవాస్తవాలు, గాలి వార్తలు అంటూ కొట్టిపారేశారు. ఇలాంటి వార్తలను ఎవరు పుట్టిస్తారో తమకు తెలియడంలేదనీ, సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నదంటా అవాస్తవమని చెప్పారు. కానీ ఆమధ్య దుబాయ్ లో పూజా హెగ్దేతో ఎవరో గొడవపెట్టుకున్నారంటూ వార్తలు వచ్చాయి. ఆ బ్యాచే ఈమెకి ఇలాంటి సందేశాలను పంపినట్లు చెప్పుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి వుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు