పూజా హెగ్డే స్థానంలో శ్రీలీలని తీసుకోవాలని చిత్రనిర్మాతలు తీసుకున్న నిర్ణయంతో, "అల వైకుంఠపురంలో" ఫేమ్ పూజా హెగ్డే.. టాలీవుడ్‌లో తన పాపులారిటీని కోల్పోయింది. తరువాతి రెండేళ్లపాటు మరో పాత్రను పొందలేకపోయింది.
ప్రస్తుతం పూజా హెగ్డే సీన్ మారింది. వరుణ్ ధావన్ కొత్త చిత్రంలో నటించే ఛాన్సును పూజా హెగ్డే సొంతం చేసుకుందని.. వరుణ్ ధావన్ తండ్రి, చిత్రనిర్మాత డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించనున్నాడని బాలీవుడ్ మీడియా పేర్కొంది.