ప్రస్తుతం భారతదేశపు అతిపెద్ద స్టార్‌లలో ఒకరైన ప్రభాస్ ఫేస్‌బుక్ హ్యాకింగ్‌కు గురైంది. ప్రభాస్ ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందనే విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. "అందరికీ నమస్కారం, నా ఫేస్‌బుక్ హ్యాక్ అయ్యింది." అని ప్రభాస్ తన అభిమానులకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రభాస్ తెలియజేశారు.
ఇక ప్రభాస్ టీమ్ అతని Facebook పేజీని నిర్వహిస్తుంది. ప్రభాస్‌కు ఫేస్‌బుక్‌లో 24 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రభాస్ ప్రస్తుతం "సలార్", "కల్కి"చిత్రాలలో నటిస్తున్నారు. వీటిలో సలార్ సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదల కానుంది.