రామమందిర విషయంలో ప్రభాస్ పై వస్తున్నవార్తలు నిజంకాదు

డీవీ

గురువారం, 18 జనవరి 2024 (17:48 IST)
Prabhas latest
ప్రభాస్ ఆదిపురుష్ సినిమా చేయడంతో ఆయనపై పలు రూమర్లు వచ్చాయి. అందులో బాగంగా రామమందిరం విషయంలో బాలీవుడ్ మీడియాలో కొన్ని పుకార్లు వచ్చాయి. అదేమిటంటే,  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జనవరి 22న అయోధ్యలో నూతన రామమందిర ప్రారంభోత్సవానికి రెబల్ స్టార్ ప్రభాస్‌తో సహా ప్రముఖ భారతీయ సినీ తారలు హాజరుకానున్నారు. ఆలయ ప్రారంభోత్సవానికి ప్రభాస్ 50 కోట్ల రూపాయల విలువైన ఆహారాన్ని అందిస్తున్నట్లు హిందీ మీడియాలో ఇటీవలి తెలియజేశాయి.
 
అయితే, ప్రభాస్ బృందం ఈ పుకార్లను కొట్టిపారేసింది, వాదనలలో నిజం లేదని పేర్కొంది, ఈ వార్తలను పూర్తిగా ఫేక్ అని కొట్టిపారేసింది. రామమందిరాన్ని పవిత్రంగా ఆవిష్కరిస్తారని దేశం ఎదురుచూస్తుండగా ఈ చారిత్రాత్మక ఘట్టం కోసం ఎదురుచూపులు ఎక్కువగానే ఉన్నాయి. ఈవేడుకకు చిరంజీవి, రామ్ చరణ్ తదితరులు కూడాహాజరుకానున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు