యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాథేశ్యామ్ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఇటలీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. ఆదిపురుష్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రాథేశ్యామ్ ఇటలీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని ప్రబాస్ ముంబాయిలో వాలిపోయాడు. ఆదిపురుష్ డైరెక్టర్ ఓంరౌత్‌తో చర్చలు జరిపిన తర్వాత ఈ మూవీకి ఆరు నెలలు డేట్స్ ఇచ్చేందుకు ఓకే చెప్పాడని తెలిసింది.
అంతేకాకుండా... రాథేశ్యామ్ రిలీజ్ ఎప్పుడు అనేది క్లారిటీ ఇవ్వాలని ప్రభాస్ పైన ఒత్తిడి పెంచుతున్నారని సమాచారం. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో పాన్ వరల్డ్ మూవీని ప్రకటించారు. ఈ సినిమాని త్వరలోనే స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో అమితాబ్, దీపికా పడుకునే నటిస్తున్నారు.