తెలుగులో ఒంటరి, మహాత్మా వంటి చిత్రాలలో నటించి గుర్తింపు పొందిన మలయాళ నటి భావన తన వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న పుకార్లపై స్పందించింది. తన భర్త నుండి విడాకులు తీసుకుంటున్నట్లు వస్తున్న ఊహాగానాలపై ప్రస్తావిస్తూ, ఈ వార్తలను తీవ్రంగా ఖండించింది. తాను విడాకులు కోరుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది.