డేరింగ్ & డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మెహబూబా సినిమా తర్వాత నెక్ట్స్ మూవీని ఎనౌన్స్ చేయలేదు. అయితే.. తనయుడు ఆకాష్‌తో తీయనున్నాడు అని వార్తలు వచ్చాయి. స్వయంగా పూరినే ప్రకటించాడు కూడా. కానీ.. ఏమనుకున్నాడో ఏమో ఆకాష్‌తో చేయాలనుకున్న సినిమాని తన శిష్యుడు అనిల్‌కి దర్శకత్వ బాధ్యతలు అప్పచెప్పాడు. పూరి ఎనర్జిటిక్ హీరో రామ్‌తో సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఎనౌన్స్‌మెంట్ రానుంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మరిన్ని కమిట్‌మెంట్‌లు ఇచ్చాడట. అవన్నీ ఎప్పుడు పూర్తవ్వాలి? ఎప్పుడు పూరీకి డేట్లివ్వాలి. పూరినే కాకుండా మారుతి, గోపీచంద్ మలినేని కూడా విజయ్ దేవరకొండతో సినిమా చేయాలనుకుంటున్నారట. మరి.. విజయ్ పూరికి ఎప్పుడు డేట్స్ ఇస్తాడో..?