టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ వివాదం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా చిత్ర పరిశ్రమను కుదిపివేస్తున్న ''క్యాస్టింగ్ కౌచ్'' అనే మాట ఎంతగా సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో అదితి రావు బాలీవుడ్‌లో కుదురుకునేందుకు పడిన కష్టాలను ఏకరవు పెట్టింది. బాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ ఉందని, దాని ప్రభావం కూడా ఎక్కువగానే ఉందని అదితి చెప్పింది.
కాస్టింగ్ కౌచ్ కారణంగానే తాను చాలా కాలం పాటు సినిమాలకు దూరమయ్యానని తెలిపింది. ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు తీవ్రంగానే ఉన్నాయని వెల్లడించింది. ఇదే తరహాలో మెగా హీరోయిన్ నిహారిక కూడా క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించింది. క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం ఒక్క సినీ పరిశ్రమలో మాత్రమే లేదు. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎవరైనా తమకు తాము అంగీకరిస్తేనే అవుతుందనీ, తన అంగీకారం లేకుండా జరిగితే అది రేప్ కిందకు వస్తుందని నిహారిక అభిప్రాయపడింది.
తాజాగా ఇదే అంశంపై రాయ్ లక్ష్మి స్పందించింది. ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తున్న నటీమణులకు క్యాస్టింగ్ కౌచ్ తప్పదని స్పష్టం చేసింది. కొత్తగా వచ్చిన వాళ్లు.. లొంగిపోవడమా? లేదంటే అవకాశాలు వదులుకోవడమా? అనేది వాళ్లే నిర్ణయించుకోవాలని తెలిపింది. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే మాత్రం కాంప్రమైజ్ కాక తప్పదని క్లియర్ కట్‌గా చెప్పేసింది.