వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో రాజ్ తరుణ్‌కు ఈ మధ్య వచ్చిన ఫ్లాప్ ఈ యంగ్ హీరో స్పీడ్‌కు బ్రేక్ వేసింది. దీనితో రాజ్ తరుణ్ తన సినిమాల ఎంపికలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ తన ఇమేజ్ మరింత పడిపోకుండా చూసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ తన క్రేజ్‌ను పెంచుకోవడానికి మరో ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్నాడు.
ఈ మధ్య కాలంలో టాప్ హీరోల సినిమాల నుంచి చిన్న హీరోల సినిమాల వరకు ఐటమ్ సాంగ్ క్రేజ్ కామన్‌గా మారిపోవడంతో రాజ్ తరుణ్ ఇప్పటికే పూర్తి అయిన ఒక సినిమాలో ప్రత్యేకంగా ఒక ఐటమ్ సాంగ్ పెట్టడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది. 'దొంగాట' మూవీ దర్శకుడు వంశీ కృష్ణ డైరక్షన్‌లో రాజ్ తరుణ్ 'కిట్టుగాడు' అనే మూవీని చేస్తున్నాడు.
అయితే ఈ స్పెషల్ సాంగ్‌కు రష్మి అయితే బాగుంటుదని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో రష్మీ తన అందాలు ఆరబోయడంలో ఎటువంటి పరిమితులు లేకుండా సహకరిస్తున్న నేపథ్యంలో రష్మీ ఎక్స్‌పోజింగ్ ఈ సినిమాకు మరింత ప్లస్‌గా మారుతుందని ఈ సినిమా దర్శక నిర్మాతల ఆలోచన అని అంటున్నారు. 'గుంటూర్ టాకీస్' మూవీలో రష్మీ నటించిన పాట యూట్యూబ్‌లో రికార్డ్స్ క్రియేట్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం టాప్ రేంజ్‌లో కొనసాగుతున్న రష్మీ క్రేజ్ రాజ్ తరుణ్‌కు అన్ని విధాల సహకరిస్తుంది అని ఈ సినిమా నిర్మాతల భావన.